ఆ విషయంలో తగ్గిన విజయ్.. కారణం ఇదేనా..?

Vijay 9

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీ గా రన్ అవుతోంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రమంలో తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు.

విజయ్‌తో గతంలో ‘టాక్సీవాలా’ అనే సినిమాను రూపొందించిన రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే, ఈ సినిమా కోసం తొలుత భారీ బడ్జెట్‌ను అనుకున్నారట. కానీ, ఆయన సినిమాలకు జరుగుతున్న నాన్-థియేట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే, అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అవుతుందేమో అని మేకర్స్ భావిస్తున్నారట.

దీంతో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో వారు పనరాలోచిస్తున్నారట. ఈ లెక్కన ముందు అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్‌తో విజయ్ సినిమా రూపొందనుంది. మరి ఈ విషయంపై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version