మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న ‘మెగా 158’ షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమా 2027 సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ కేవీఎన్ ఇతర ప్రాజెక్టుల వల్ల షూటింగ్ మార్చికి వాయిదా పడటమే దీనికి ప్రధాన కారణం.
‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఇది భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా కావడంతో చిత్రీకరణకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం అవసరమవుతుంది. అందుకే సంక్రాంతి హడావిడి లేకుండా, 2027 వేసవి విడుదలే లక్ష్యంగా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ సినిమాలో చిరంజీవి గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ‘మన శంకర వరప్రసాద్ గారు’తో ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న మెగాస్టార్, బాబీతో కలిసి మరో మ్యాజిక్ రిపీట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
