మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ‘RC17’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
కాగా, ఈ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమయంలో తలెత్తిన కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఈ మార్పు జరుగుతోందని ఇండస్ట్రీ టాక్.
ప్రస్తుతం డీఎస్పీ స్థానంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సచ్‌దేవ్‌తో పాటు యంగ్ సెన్సేషన్స్ హర్షవర్ధన్ రామేశ్వర్ లేదా సాయి అభ్యంకర్‌ల పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నాడట. మరి నిజంగానే ఈ సినిమా నుంచి దేవిశ్రీ తప్పుకున్నాడా.. అనేది తెలియాల్సి ఉంది.
