టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ కొరటాల శివ, ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘దేవర’ మంచి విజయాన్ని అందించినప్పటికీ, దాని రెండో భాగం విషయంలో సందిగ్ధత నెలకొంది. ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండటంతో ‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ ఖాళీ సమయంలో కొరటాల శివ స్టార్ హీరోలు బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్‌లను సంప్రదించినట్లు వార్తలు వస్తు్న్నాయి. అయితే, వీరిద్దరూ కూడా కొరటాల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్లకు మొగ్గు చూపుతుండగా, పవన్ కూడా ఇతర దర్శకులకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది కొరటాల శివకు ఊహించని పెద్ద షాక్ అనే చెప్పాలి.
మరోవైపు నాగచైతన్య 25వ సినిమాకు కూడా కొరటాల పేరు వినిపించినా, అది కూడా కుదరలేదు. ప్రస్తుతం చిన్న హీరోలతో సినిమాలు చేసే ఆసక్తి ఆయనకు లేకపోవడంతో, ఎన్టీఆర్ కోసం వేచి చూడటం మినహా కొరటాలకు వేరే ఆప్షన్ లేదు. ‘దేవర 2’ పట్టాలెక్కే వరకు ఈ స్టార్ డైరెక్టర్ నిరీక్షణ తప్పేలా లేదు.
