యంగ్ హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ చిత్రం ‘మోగ్లీ’ మంచి బజ్‌తో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫారెస్ట్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. సాక్షి మదోల్కర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ టాక్‌తో రన్ అవుతుంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్న ఈటీవీ విన్ ఈ చిత్రాన్ని త్వరలోనే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోందట. అనుకున్న సమయానికంటే ముందే, న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
మరి నిజంగానే ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ ట్రీట్‌గా స్ట్రీమింగ్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
