ఎట్టకేలకు ముందుకు కదలనున్న టాక్సిక్.. అప్డేట్ వచ్చేస్తోంది..?

Toxic

‘కేజీఎఫ్’ స్టార్ యష్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘టాక్సిక్’ చిత్రంపై గత కొన్నాళ్లుగా బజ్ తగ్గింది. టీమ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే సినిమా రెండుసార్లు వాయిదా పడిందనే ప్రచారం సాగింది. అంతేకాదు, యష్ స్వయంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు టాక్ నడిచింది. అయితే, ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ ఈ ప్రాజెక్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది.

​చాలా కాలంగా ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కోసం వచ్చే వారం ఒక సాలిడ్ అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ‘రామాయణ’ మినహా మరే ప్రాజెక్ట్ సైన్ చేయకుండా కేవలం ‘టాక్సిక్’ కోసమే యష్ కొన్నేళ్లుగా కేటాయించడంతో, ఈ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

​వచ్చే వారం రాబోయే ప్రకటనలో సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుస వాయిదాల వల్ల కోల్పోయిన హైప్‌ను పాన్-ఇండియా, ఇంటర్నేషనల్ లెవెల్లో మళ్లీ మొదటి నుండి బిల్డ్ చేయడం చిత్ర యూనిట్‌కు సవాల్‌గా మారినప్పటికీ, ఈ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు మళ్లీ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version