మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కేవలం ఒక భాగంతో సరిపెట్టుకోకుండా, రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జోరందుకుంది.
తాజా సమాచారం ప్రకారం, ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేశారని.. ప్రస్తుతం షూటింగ్ కూడా రెండు పార్టులకు కలిపి ఏకకాలంలో జరుగుతోందని సమాచారం. కథా పరిధి పెద్దది కావడంతో దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల టాక్. ఒకవేళ ఇదే నిజమైతే, ఎన్టీఆర్ అభిమానులకు ఇది ఒక భారీ సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
ఇక ఈ చిత్రాల విడుదల విషయానికొస్తే, మొదటి భాగం జూన్ 11, 2027న వేసవి కానుకగా వచ్చేలా ఇప్పటికే మేకర్స్ డేట్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజా రూమర్ ప్రకారం రెండో భాగాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా అదే ఏడాది డిసెంబర్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. కేవలం ఆరు నెలల గ్యాప్లోనే రెండు భాగాలు రావడం టాలీవుడ్లో ఒక కొత్త రికార్డ్ అవుతుంది.
