రణ్‌బీర్ కపూర్ తన కెరీర్‌లో ప్రస్తుతం పీక్ స్టేజీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, రాబోయే ఐదేళ్ల పాటు బాక్సాఫీస్ వద్ద రణ్‌బీర్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ‘రామాయణ’ మరియు ‘లవ్ అండ్ వార్’ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, 2026 చివరి నాటికి ఈ రెండింటినీ పూర్తి చేసే అవకాశం ఉంది.
అయితే, ఆ తర్వాత రణ్‌బీర్ ఏ సినిమాను పట్టాలెక్కిస్తాడనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ముందు ‘బ్రహ్మాస్త్ర పార్ట్ 2: దేవ్’ మరియు ‘ధూమ్ 4’ వంటి రెండు భారీ ఆప్షన్లు ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచాన్ని విస్తరించే ‘బ్రహ్మాస్త్ర 2’ ఒకవైపు ఉండగా, యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న ‘ధూమ్ 4’ మరోవైపు ఉంది. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా అది ఇండియన్ సినిమాలోనే భారీ ప్రాజెక్ట్ కానుంది.
కానీ, ఈ ఎంపిక వెనుక ఒక పెద్ద చిక్కుముడి ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే ‘యానిమల్ పార్క్’ 2027 ద్వితీయార్థంలో ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభాస్ ‘స్పిరిట్’ పూర్తి చేసిన తర్వాత సందీప్ ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తాడు. ఒకవేళ రణ్‌బీర్ 2026 చివరలో ‘బ్రహ్మాస్త్ర 2’ లేదా ‘ధూమ్ 4’ ప్రారంభిస్తే, ఆ భారీ సినిమాలు పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ఇది నేరుగా ‘యానిమల్ పార్క్’ షెడ్యూల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో రణ్‌బీర్ ఏ ప్రాజెక్ట్ ఓకే చేసినా అది సందీప్ రెడ్డి ప్లాన్‌కు హ్యాండ్ ఇచ్చేలా మారనుందని బిటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
