రామాయణ : ఇంగ్లీష్ వెర్షన్‌లో ఏకంగా అన్ని నిమిషాలు కట్..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తొలి పాట ‘జయ జయ రామ్‌’ విడుదలైన సంగతి తెలిసిందే. అర్జిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ భక్తి గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

దీపావళి కానుకగా ‘రామాయణ- పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, నమిత్ మల్హోత్రాతో కలిసి కేజీఎఫ్ స్టార్ యశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. కాగా, ఈ సినిమా ఇంగ్లిష్ వెర్షన్‌కు సంబంధించి నెట్టింట ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

విదేశీ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఇంగ్లీష్ వెర్షన్ రన్‌టైమ్‌ను హిందీతో పోలిస్తే దాదాపు 30 నిమిషాలు తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ లాంగ్ రన్‌టైమ్, మధ్యలో వచ్చే పాటలను పెద్దగా ఇష్టపడరనే ఉద్దేశంతో ఇంగ్లిష్‌ వెర్షన్‌లో అసలు పాటలే లేకుండా కొన్ని సీన్స్‌ను ట్రిమ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రచారంపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం గమనార్హం.

Exit mobile version