లెజెండరీ సింగర్ బయోపిక్ కోసం రష్మిక..?

భారత రత్న, ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్ట్ కోసం సాయిపల్లవిని తొలుత అనుకున్నప్పటికీ, ఆమె కాల్షీట్ల సమస్యల కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ దిగ్గజ గాయని పాత్రలో నటించడానికి టాలెంటెడ్ నటి రష్మిక మందన్న ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జయంతి అయిన సెప్టెంబర్ 16న మేకర్స్ అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు.
​కేవలం నటన మాత్రమే కాకుండా, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి అభినయం, హుందాతనం మరియు వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించడం రష్మికకు ఒక పెద్ద సవాలుగా మారనుంది. ఒకవేళ ఆమె ఈ పాత్రలో విజయవంతంగా ఒదిగిపోతే, ఆమె కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

రాక్‌లైన్ వెంకటేష్, అల్లు అరవింద్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 16న రానున్న అధికారిక ప్రకటనతో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Exit mobile version