ట్రెలర్ టాక్ : అమ్మవారి శాపం.. 33 ఏళ్ల మర్మం.. ఆకట్టుకుంటున్న ‘మహేంద్రగిరి వారాహి’ ట్రైలర్!

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ట్రైలర్ తాజాగా విడుదలై టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మహేంద్రగిరి రాజవంశంలో 33 ఏళ్లు నిండిన ప్రతి మగబిడ్డ రహస్య రీతిలో మరణించడం, ఇది వారాహి అమ్మవారి శాపమా లేక మరేదైనా కుట్రా అనే పాయింట్ తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఐశ్వర్య రాజేష్, మాళవికా నాయర్, మీనాక్షి గోస్వామి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో సస్పెన్స్ ఎలిమెంట్స్ హైలైట్ గా నిలిచాయి. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ క్యామియో మరో హైలైట్ గా నిలవనుంది.

​ఇక ఈ ట్రైలర్ లోని విజువల్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ లో ఉన్నాయని ట్రేడ్ వర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పాంథర్ అటాక్ సీక్వెన్స్, అలాగే క్లైమాక్స్ లో చూపించిన వారాహి అమ్మవారి ఉగ్రరూపం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ అందించిన అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ లోనూ ఆధ్యాత్మికత, ఉత్కంఠను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడంతో, ఈ సినిమా సుమంత్ కెరీర్ లో మరో డిఫరెంట్ అటెంప్ట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు విడుదల కానున్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version