సామ్ ‘మా ఇంటి బంగారం’ కూడా వెనక్కి వెళ్తుందా..?

Maa-Inti-Bangaaram

స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్ర విడుదల తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. అయితే, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయిదా వేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

మే 15న సూర్య నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’) విడుదలవుతుండటం ఒక ప్రధాన కారణం. తెలుగులో కూడా సూర్యకు మంచి క్రేజ్ ఉండటం, ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో ఆ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, పోటీని నివారించాలని ‘మా ఇంటి బంగారం’ టీమ్ భావిస్తోంది. రిస్క్ తీసుకోవడం కంటే సోలో రిలీజ్ వైపు మొగ్గు చూపడం మంచిదని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

మరోవైపు, జూన్ 4న విడుదల కావాల్సిన యశ్ ‘టాక్సిక్’ వాయిదా పడటంతో ఆ తేదీ ఖాళీగా ఉంది. ఆ డేట్‌ని క్యాష్ చేసుకోవడానికి జూన్ 4న సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్లు ఇప్పటికే మొదలైనందున, మధ్యలో బ్రేక్ ఇచ్చి జూన్ వరకు ఆగడం సరైన నిర్ణయమేనా అనే చర్చ కూడా నడుస్తోంది. మరి ఈ రిలీజ్ డేట్ మార్పుపై సమంత మరియు టీమ్ త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Exit mobile version