బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ ‘కింగ్’ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటాలని షారుఖ్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత షారుఖ్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ చర్చ సాగుతుంది.
అయితే, షారుఖ్‌కి ‘జవాన్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన సౌత్ దర్శకుడు అట్లీతో ఆయన మరో సినిమా చేస్తాడని బిటౌన్లో సాలిడ్ బజ్ వినిపిస్తోంది. దీనికి షారుఖ్ కూడా పాజిటివ్‌గా ఉన్నాడని తెలుస్తోంది. దీంతో త్వరలోనే వీరి కాంబినేషన్‌పై ఓ సాలిడ్ అప్డేట్ రావడం ఖాయమని బాలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
కానీ, అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘రాకా’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాతే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడట. మరి కింగ్ ఖాన్‌తో అట్లీ మూవీపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
