శ్రీలీలకు క్రేజీ ఛాన్స్..? ఆ సినిమాతో దశ తిరిగేనా..?

వరుస సినిమాలతో అలరిస్తున్నప్పటికీ సరైన హిట్‌ సాధించలేక నిరాశలో ఉన్న బ్యూటీ శ్రీలీలకు ఒక క్రేజీ ఆఫర్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ నిర్మాణంలో, సూపర్‌స్టార్ రజనీకాంత్ – దర్శకుడు అశ్విత్ మరిముత్తు కాంబినేషన్‌లో రాబోతున్న ‘ధర్మన్’ చిత్రంలో ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలుగులో వరుస ప్లాప్‌ల వల్ల కాస్త నెమ్మదించిన శ్రీలీల కెరీర్‌కు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కానుంది. రజనీకాంత్ చిత్రంలో నటించే అవకాశం దక్కితే, అది ఆమె కోలీవుడ్‌తో పాటు రాబోయే బాలీవుడ్ ఎంట్రీకి కూడా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Exit mobile version