సూర్య నెక్స్ట్ మూవీలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

సూర్య నెక్స్ట్ మూవీలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా..?

Published on Aug 19, 2026 9:04 PM IST

suriya

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ‘కరుప్పు’ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఇటీవల విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంతో తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తూ దుమ్మురేపుతున్నాడు. ఈ రెండు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సూర్య, ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా, ఈ సంవత్సరంలోనే తన మూడో చిత్రాన్ని విడుదల చేసేందుకు ఆయన శరవేగంగా సిద్ధమవుతున్నాడు. ‘ఆవేశం’ ఫేమ్ జితూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సూర్య చాలా కాలం తర్వాత పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ వార్త ఇప్పుడు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో సూర్య ఒక అంధుడైన పోలీస్ అధికారిగా కనిపిస్తాడని సమాచారం.

ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో చూపు కోల్పోయిన హీరో, కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ రీ-ఓపెన్ అయిన క్రైమ్ కేస్‌ను ఎలా ఛేదించాడనేది ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, చిత్ర బృందం నుంచి అధికారిక అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు