బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) ఇండియాన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను ఆదిత్య ధర్ డైరెక్ట్ చేయగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ.1400 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ‘ధురంధర్ : ది రివెంజ్’ను మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.
దీంతో ఈ సీక్వెల్ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) లో పలు క్రేజీ క్యామియోలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ చేస్తున్నట్లు నటి యామి గౌతమ్ ప్రకటించింది. ఆమె ఈ సినిమాలో యాక్షన్ క్యామియోలో కనిపించబోతుందట. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రంలో క్యామియోలో సర్ప్రైజ్ చేసే అవకాశం ఉందని బి టౌన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా స్టార్ యాక్టర్స్ ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) లో క్యామియో రోల్స్ చేస్తూ కనిపిస్తే, థియేటర్లలో ప్రేక్షకులు థ్రిల్ కావడం ఖాయం. మరి నిజంగానే ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ క్యామియోలు చేస్తారా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
