మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా హెయిర్ స్టైల్‌తో పాటు చిరు డ్రెసింగ్ స్టైల్ కూడా మారుస్తున్నారట. మొత్తానికి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెగాస్టార్ కనిపిస్తారని.. ఇందుకోసం సెలబ్రిటీల హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హాకిమ్ మెగాస్టార్ కొత్త హెయిర్ స్టైల్ ను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి కొత్త లుక్ లో చూపించనున్నారు. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.
