కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘కరుప్పు’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ హిట్‌గా దూసుకుపోతుండటంతో సూర్య ఎంతో ఊరట చెందాడు. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయన ల్యాండ్‌మార్క్ 50వ చిత్రం గురించి కోలీవుడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, విజయ్ ‘జన నాయగన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ సూర్యను సంప్రదించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూర్య ప్రతిష్టాత్మక 50వ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఈ ల్యాండ్‌మార్క్ మూవీ కోసం ఒక స్టార్ డైరెక్టర్ వేటలో పడింది చిత్రబృందం. దర్శకుడు ఖరారైన వెంటనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పూర్తి చేసి, మలయాళ దర్శకుడు జితు మాధవన్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సూర్య 47’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇవి కాకుండా ‘కరుప్పు’ సీక్వెల్‌తో పాటు మరికొందరు దర్శకులతో కూడా ఆయన కథా చర్చలు జరుపుతున్నాడు.
