పెద్ది : రాసి పెట్టుకోండి.. ఇది ఒక అద్భుతమైన సినిమా – రామ్ చరణ్

ram-charan

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ ఇండస్ట్రీలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులో జరిగిన కన్నడ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ తీవ్రంగా శ్రమించారు అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఇక ఈ సినిమాపై తాను పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటూ చెప్పుకొచ్చిన రామ్ చరణ్.. ‘రాసి పెట్టుకోండి.. నా కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక అద్భుతమైన సినిమాగా నిలుస్తుంది’ అంటూ చరణ్ ఈ చిత్రంపై తనకున్న నమ్మకాన్ని బలంగా చాటాడు. అటు భోపాల్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో కూడా రామ్ చరణ్ ఈ సినిమాపై తన కాన్ఫిడెన్స్ తెలిపాడు.

సినిమా ప్రమోషన్స్‌లో చరణ్ ఇంతటి కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తుండటంతో, ప్రేక్షకులకు ఈసారి థియేటర్లలో ఒక సరికొత్త అనుభూతి లభించబోతుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version