రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, సినీ వరగాల్లో అదిరిపోయే అంచనాలు నెలకొన్నాయి.
‘కాంతార చాప్టర్ 1’ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపుతో పాటు ఉదయం 6 గంటల ప్రత్యేక షోలకు అనుమతులు కోరేందుకు చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ షోల టికెట్ ధర రూ. 500 గాను, రెగ్యులర్ షోలకు రూ. 50 నుండి రూ. 100 వరకు పెంచే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల అందుబాటు ధరల వల్ల థియేటర్లకు జనాలు బాగా వస్తున్న తరుణంలో, ఈ రేట్ల పెంపుపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
