మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎప్పుడో మొదలు పెట్టిన భారీ ఫాంటసీ చిత్రమే ‘విశ్వంభర’, చిరంజీవి స్ట్రైట్ సినిమాలకి అందులోని ఫాంటసీ జానర్ లో అనౌన్స్ చేయడంతో ‘విశ్వంభర’ పై అప్పట్లో నెలకొన్న హైప్ వేరు. కానీ సినిమా అలా ఆలస్యం అవుతూ వస్తున్న నేపథ్యంలో మరో హరిహర వీరమల్లు లా అంచనాలు తగ్గు ముఖం పట్టాయి.
ఈ ఏడాది వేసవిలో రావాల్సిన సినిమా ఇప్పటికీ అడ్రెస్ లేదు. ఇంకొక పక్క మూడు రోజుల్లో మెగాస్టార్ పుట్టినరోజు వస్తున్న నేపథ్యంలో తన 158వ సినిమా అప్డేట్ పనులు చకచకా జరుగుతున్నాయి. కానీ విశ్వంభర సైడ్ నుంచి మాత్రం చిన్నపాటి సౌండ్ కూడా లేదు.
మినిమమ్ అప్డేట్స్ అయినా వదిలినా అభిమానుల్లో లేని ఉత్సుకత పెరుగుతుంది. కానీ మేకర్స్ కాలయాపన ఈసారి చిరు బర్త్ డే ని చెప్పగానే మార్చింది. సో ఈ సినిమాని ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకునేలా వరుస అప్డేట్స్, ఇంటరాక్షన్ ఉంటాయా లేక లైట్ తీసుకోవడమేనా అనేది ఈ కొన్ని రోజుల్లో తేలిపోతుంది.
