పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విడుదలకు ముహూర్తం ఖరారైంది. గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన ఈ క్రేజీ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 22న అత్యంత భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రెండు రోజుల సమయాన్ని కేటాయించారని తెలుస్తోంది. పవర్ స్టార్ స్వయంగా ప్రచార బరిలోకి దిగుతుండటంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగిపోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పార్తీబన్ విలన్‌గా కనిపిస్తుండగా, గౌతమి, అశుతోష్ రాణా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 26న పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.
