తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన లేటెస్ట్ చిత్రం ‘డిసి’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు. ఎలాంటి ప్రమోషన్లు, ఆర్భాటాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.
తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండో రోజు మంచి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా పుంజుకుని విజయం వైపు దూసుకెళ్తోంది. అయితే, ఈ కథలో మొదటి ఛాయిస్ లోకేష్ కనగరాజ్ కాదట. మొదట దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ లైన్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు వినిపించాడని.. తాను అప్పటికే చేస్తున్న సినిమాల తరహాలోనే ఉండటంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌ను నో చెప్పాడని తెలుస్తోంది.
ఆ తర్వాతే ఈ అవకాశం లోకేష్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజయ్ దేవరకొండ పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి జంటగా నటించిన ఈ తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తెలుగులోనూ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
