‘తలైవర్ 173’ కోసం నెవర్ బిఫోర్ విలన్.. నిజమేనా..?

Thalaivar 173

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాణంలో రాబోతున్న ‘తలైవర్ 173’ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ‘డాన్’ సినిమాతో మెప్పించిన శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ కాంబినేషన్‌ను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం ఎవరూ ఊహించని పేరు వినిపిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రజనీకాంత్‌కు ధీటుగా నిలిచే విలన్ పాత్రలో లెజెండరీ దర్శకుడు శంకర్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేకర్స్ ఈ ప్రతిపాదనను తీసుకువెళ్ళినప్పుడు శంకర్ పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో రజనీకాంత్‌తో ‘రోబో’, ‘శివాజీ’ వంటి ఇండస్ట్రీ హిట్లను తెరకెక్కించిన శంకర్, ఇప్పుడు ఆయనకు విలన్‌గా మారబోతుండటం సినీ ప్రియుల్లో అదిరిపోయే ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

మరో విశేషమేమిటంటే, ఈ సినిమాలో నిర్మాత కమల్ హాసన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించబోతున్నాడట. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాతో శంకర్ రజినీ పాలిట విలన్‌గా మారతాడా అనేది చూడాలి.

Exit mobile version