‘శైలజా రెడ్డి అల్లుడు’ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే !

Naga chaithanya1

మారుతీ దర్శకత్వంలో యువ హీరో నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ జులై మొదటి వారంలో విడుదలకానుందని సమాచారం. సీనియర్ నటి రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథనాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్రాన్ని ఆగష్టు 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ అలాగే చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక నాగచైతన్య నటిస్తున్న మరో చిత్రం’ సవ్యసాచి’ ఫస్ట్ లుక్ టీజర్ కూడా జులై 6 న గాని లేదా 7వ తేదీన గాని విడుదల కానుందని ఇప్పటికే వార్తలోచ్చాయి. అంటే చైతు ఈ జులైలో బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ లుక్, టీజర్లతో సందడి చేయనున్నారన్నమాట.

Exit mobile version