ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ అండ్ మొట్ట మొదటి పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. బన్నీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ కావడంతో దీనిపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే లేటెస్ట్ గా బన్నీ తన అభిమానులకు ఆల్రెడీ కొత్త సంవత్సరం గిఫ్ట్ ను వారి స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో స్టార్ హీరోయిన్ సమంతాతో స్టార్ట్ చేసిన సెలెబ్రెటీ షో సామ్ జామ్ లో తన ఇంటర్వ్యూ తో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ను అందించనున్నాడు.
అయితే ఇప్పటికే షూట్ పూర్తి కాబడిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ను ఆహా వారు 2021 జనవరి 1 న ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. అయితే మరి ఇందులో తన సాలిడ్ చిత్రం “పుష్ప”పై కూడా ఆసక్తికర టాపిక్ ఉంటుందని తెలుస్తుంది. బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కోసం బన్నీ నిజంగానే ఏమన్నా హింట్స్ ఇచ్చారా లేదా అన్నది తెలియాలి అంటే ఆ ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
