ఎన్.టి.ఆర్ ఐటమ్ గర్ల్ టాలీవుడ్ లో తన మార్క్ వేసుకుంటుందా.?

NTR_Nora-Fatehi
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఎన్.టి.ఆర్ సరసన నోర ఫతేహి అనే ఓ కొత్త ఐటమ్ భామ స్టెప్స్ వేయనుంది. సూపర్బ్ లుక్స్ తో తన హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న నోర ఈ ఐటెం సాంగ్ లో తన గ్లామర్ తో ఆడియన్స్ లో హీట్ పెంచేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ఈ సాంగ్ సినిమాలో సూపర్ హిట్ అయ్యి, నోర ఫతేహి తన అందాలతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటే టాలీవుడ్ లో నోరకి ఇదొక పెద్ద బూస్టప్ అవుతుంది. మరి ఆ మార్క్ వేసుకుంటుందా లేదా అనే దాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిసున్నాడు.

Exit mobile version