దుబాయ్‌లో ‘సైమా’ అవార్డ్స్ సందడి..!

siima-awards1
సినీ అవార్డ్ ఫంక్షన్స్ అంటే తారల తళుకులు, డ్యాన్స్ పర్ఫామెన్స్‌లు.. ఇలా కళకళాలాడిపోయే వేదిక. ఇక గత మూడేళ్ళుగా జరుగుతూ వస్తోన్న సైమా అవార్డ్స్‌ది మరో ప్రత్యేకత. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో సౌతిండియాలో నాలుగు భాషల సినిమాలకు ఈ వేడుకలో వివిధ క్యాటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తారు. దుబాయ్‌లో గత మూడేళ్ళుగా వైభవంగా జరుగుతూ వచ్చిన వేడుక ఈ సారి కూడా అదే సందడి తెచ్చిపెట్టింది. తారల సందడితో నిన్న మొదలైన ఈ వేడుక మొత్తం రెండు రోజుల పాటు జరగనుంది.

దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిన్న అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఆట పాటలతో జోరుగా హుషారుగా సాగింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరై ఈ వేడుకకు కొత్త శోభను తెచ్చిపెట్టారు. తెలుగు పరిశ్రమ నుంచి బాలకృష్ణ, వెంకటేష్, అల్లు అర్జున్, రానా తదితరులు హ్యాజరయ్యారు. సినీ నటుల స్కిట్స్, ఆట, పాటలతో ఈ వేడుక జోరు మీద మొదలై అదే జోరును కొనసాగిస్తూ సాగుతోంది.

Exit mobile version