చై-సామ్ ల బంధానికి రెండేళ్లు..,

chay sam

టాలీవుడ్ అందమైన జంట సమంత, చైతన్యలు పెళ్లిబంధంతో ఒక్కటై నేటికి రెండేళ్లు. 2017 అక్టోబర్ 6న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటయ్యారు. అతదుపరి దినం 7న సమంత క్రిస్టియన్ కావడంతో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చర్చిలో వివాహం జరిగింది. 2015 నుండి ప్రేమలో ఉన్న ఈ రొమాంటిక్ కపుల్ రెండేళ్లకు 2017లో ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ వేదికగా సమంత ఆ అందమైన క్షణాలను గుర్తు చేసుకుంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశారు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఏమాయ చేశావే చిత్రంలో మొదటిసారి కలిసి నటించిన చై సామ్ లు మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ చిత్రాలలో కలిసి నటించారు. ఇటీవల ఓ బేబీ చిత్రంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో సోలో హిట్ కొట్టిన సమంత శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 96 చిత్రంలో నటిస్తున్నారు. ఇక నాగ చైతన్య వెంకీ మామ చిత్రం మరియు, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా మరో చిత్రం చేస్తున్నారు.

Exit mobile version