చైతన్య ‘దోచేయ్’ తో నారా రోహిత్ ‘అసుర’

చైతన్య ‘దోచేయ్’ తో నారా రోహిత్ ‘అసుర’

Published on Apr 20, 2015 2:12 PM IST

Dochey
టాలీవుడ్ లో రోజు రోజుకీ సినిమా ప్రమోషన్స్ లో కొత్త కొత్త విధానాలు వస్తున్నాయి. హీరోలు ఎలాంటి భేదం పెట్టుకోకుండా తన సినిమా రిలీజ్ తో పాటు మరో హీరో ట్రైలర్స్, ఫస్ట్ లుక్ టీజర్స్ ని రిలీజ్ చెయ్యడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఇలా పలుసార్లు జరిగింది. అదే బాటలో ఈ సారి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య – మరో యంగ్ హీరో నారా రోహిత్ కలిసి రానున్నారు. నాగ చైతన్య – కృతి సనన్ జంటగా నటించిన సినిమా ‘దోచేయ్’. ‘స్వామి రారా’ ఫేం సుదీర్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ దోచేయ్ సినిమాతో పాటు నారా రోహిత్ నటించిన ‘అసుర’ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా అసుల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. మరోసారి నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

దోచేయ్ సినిమా టాలీవుడ్ లో వస్తున్న ఓ డిఫరెంట్ సినిమా అని చైతన్య తెలిపాడు. ఇదే తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న అసుర ప్రమోట్ చెయ్యడం టాలీవుడ్ కి శుభసూచకం అని పలువురు భావిస్తున్నారు.

తాజా వార్తలు