నేడు నాగ చైతన్య పుట్టినరోజును పురస్కరించుకొని తాను నటిస్తున్న చిత్రాల నుండి ఆసక్తికర అప్డేట్స్ విడుదల చేశారు. నేటి ఉదయం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు 19వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో విడుదల చేశారు. ఓ స్పోర్ట్స్ కోచింగ్ సెంటర్ లో వర్క్ చేస్తూ, పేదింటి అబ్బాయిగా ఉన్న చైతు లుక్ భిన్నంగా ఉంది. ఈ మూవీలో చైతు సరసన సాయి పల్లవి నటిస్తుంది.
ఇక విడుదలకు సిద్దమైన చైతు మరో చిత్రం వెంకీ మామ. వెంకటేష్ తో కలిసి చేస్తున్న ఈ మూవీలో చైతు కెప్టెన్ కార్తీక్ గా నటిస్తున్నాడు. ఈచిత్రం నుండి కూడా ఓ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. బోర్డర్ లో సైనికుడిగా సాహసాలు చేస్తున్న చైతు కెప్టెన్ లుక్ ఆకట్టుకుంది. రాశి కన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కించారు.
వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
