యంగ్ హీరో రోషన్ మేక నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’ థియేటర్లలో మంచి జోష్ చూపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నిన్న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ( Champion Collections ) కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. రోషన్ కెరీర్లోనే ఈ సినిమాకి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం నైజాం ఏరియాలోనే ఈ మూవీ దాదాపు రూ. 2 కోట్ల గ్రాస్ (Gross) రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజే దాదాపు రూ. 4.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రోషన్ గత సినిమాలతో పోలిస్తే ఇదే హయ్యెస్ట్ రికార్డ్.
స్వప్న సినిమాస్ లాంటి పెద్ద బ్యానర్, ప్రదీప్ అద్వైతం టేకింగ్, మలయాళ బ్యూటీ అనస్వరా రాజన్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమా చూసిన వాళ్లంతా బాగుందని చెప్పడం (Word of mouth), సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ ఉండటంతో టికెట్ బుకింగ్స్ స్పీడ్ పెరిగాయి.
మిక్కీ జె మేయర్ మ్యూజిక్, మురళీ శర్మ, సంతోష్ ప్రతాప్ లాంటి నటుల పర్ఫార్మెన్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
