
టెలివిజన్ లో బాగా ఫేమస్ అయిన టీవీ సీరియల్ ‘అమృతం’ ని స్పూర్తిగా తీసుకొని చేస్తున్న సినిమా ‘చందమామలో అమృతం’. ఇండియాలోనే మొట్ట మొదటి సారి చందమామపై చేసిన ఈ సినిమాకి గుణ్ణం గంగరాజు దర్శకుడు.
ఈ చిత్ర నిర్మాత ఈ సినిమా ఆడియోని ఏప్రిల్ 13న హైదరాబాద్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ ఇంకా కచ్చితంగా ఖరారు చేయలేదు. గుణ్ణం గంగరాజుకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన ఎస్ఎస్ రాజమౌళి ఈ వేడుకకి హాజరు కానున్నారు.
శ్రీ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, వాసు, హరుష్, ధన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సరికొత్తగా ప్రమోట్ చేయాలని చూస్తున్న ఈ సినిమా మేలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.