మిస్టరీ థ్రిల్లర్ తో టాలెంటెడ్ డైరెక్టర్ !

nithin

హీరో నితిన్ వరుసగా కొత్త సినిమాల్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో కూడా ఇంకో సినిమా చేయనున్నాడు నితిన్. ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఆ టైటిల్ పెడుతున్నారట. యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి.

కాగా నితిన్ తో చేయబోయే సినిమా కూడా మిస్టరీ థ్రిల్లర్ అని తెలుస్తోంది. స్క్రిప్ట్ చాల బాగా వచ్చిందట. ఈ సారి చంద్రశేఖర్ యేలేటి కమర్షియల్ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నాడట. ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి విడుదల కానుంది. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, తన తదుపరి చిత్రాల పై మరింత దృష్టి పెట్టారు. మరి చంద్రశేఖర్ యేలేటి నితిన్ కి ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.

Exit mobile version