దాసరి పాత్రలో ప్రముఖ డైరక్టర్ !

Chandra Siddhartha
ఎన్టీఆర్ బయోపిక్ లో లెజండరీ దర్శకుడు దాసరి నారాయణ రావు గారి పాత్రలో వి వి వినాయక్ నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలు రూమర్ మాత్రమే అని తేలిపోయింది . ఎందుకంటే తాజాగా ఈ పాత్రా కోసం ‘ఆ నలుగురు’ చిత్ర దర్శకుడు చంద్ర సిద్దార్థ తీసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలు గా రానుంది. దాంట్లో మొదటి భాగం ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. ఎన్ బీ కే ఫిలిమ్స్ ,వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Exit mobile version