అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘ఈ పాట కోరినవారు…’ టీజర్ విడుదల.. సెప్టెంబర్ 18న రిలీజ్

Chandra Siddhartha Ee Paata Korinavaaru

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. వై.వి.సత్యనారాయణ రాజు సమర్పణలో ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్ర సిద్ధార్థ్ నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ, గతంలో తాను చంద్ర సిద్ధార్థ్ వద్ద స్క్రిప్ట్ విభాగంలో పని చేశానని గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమాల్లో ఇది విభిన్నమైన చిత్రమవుతుందని చంద్ర సిద్ధార్థ్ పేర్కొన్నారు.

దివంగత రచయిత మదన్ అందించిన కథతో, సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్ తదితర అంశాల నేపథ్యంలో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. హర్ష, అమైరా గోస్వామి, సుజనా రెడ్డి ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్ వర్ధన్, రేఖా నిరోషా ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి పులగం చిన్నారాయణ మాటలు రాయగా, జే రెక్స్ సంగీతం అందించారు.

Click here for Ee Paata Korinavaaru Teaser

Exit mobile version