
తెలుగు ప్రజలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో పవిత్రంగా భావించే 12 రోజుల గోదావరి పుష్కరాలు నిన్నటితో ముగిసాయి. ఈ గోదావరి పుష్కరాల వేడుక నిన్న సాయంత్రం రాజమండ్రిలో గ్రాండ్ గా అందరి ప్రముఖుల సమక్షంలో జరిగింది. మొదటి రోజు తొక్కిసలాటలో పలువురు చనిపోవడం తప్ప మిగతా అన్ని రోజులు ఎంతో విజయవంతంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కరాలు జరిగాయి. సక్సెస్ఫుల్ గా జరిగిన పుష్కరాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు తన సంతోషాన్ని వ్యక్తో చేయడమే కాకుండా బోయపాటి శ్రీను పై పొగడ్తల వర్షం కురిపించాడు.
మొదటి రోజు గోదావరి నిత్య హారతి కార్యక్రమం సరిగా లేదని బావించి ఆ బాధ్యతను బోయపాటి శ్రీనుకి అప్పగించి, పర్యవేక్షిస్తూ ఉన్నాను.బోయపాటి తన పనిని పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసాడు. చివరి రోజు నిత్య హారతి అంతబాగా జరగడానికి తనే ప్రధాన కారణం అని చంద్రబాబు అన్నారు. ఈ విషయంలో బోయపాటి శ్రీను కూడా చాల హ్యాపీగా ఉన్నాడు. గోదావరి పుష్కరాలు సక్సెస్ఫుల్ గా ముగియడంతో బోయపాటి ఇప్పుడు తన తదుపరి సినిమాపై దృష్టి సారిచ్న్హాడు. అల్లు అర్జున్ తో చేయనున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.