పండుగ సందర్భంగా విడుదలైన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే మంచి విజయాన్ని సంతరించుకున్న ఈ సినిమాని ప్రచారంలో సైతం ముందంజలో నిలిపి చిత్రాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు
ఈ ప్రచారంలో భాగంగా రామ్ చరణ్ కృష్ణవంశీని ప్రశంసించారు. తననుండి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని రాబట్టినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాక కృష్ణవంశీ మొండివాడని, నటులనుండి తనకు కావలసింది రాబట్టుకునే వరకూ నిద్రపోడు/ నిద్రపోనివ్వడు అని తెలిపాడు. డైరెక్టర్ ఇస్ కెప్టెన్ ఆఫ్ షిప్ అని ఊరికే అంటారా చెప్పండి?
