యుఎస్ లో గోవిందుడు ప్రమోషన్స్ ప్లాన్ చేసిన చరణ్.?

Ram-Charan-
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడు అందరివాడేలే’. మెగా అభిమానులు రెండు రోజుల ముందు నుంచే దసరా జరుపుకునేలా ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. అనుకున్న టైం కి సినిమా విడుదల అయ్యేలా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో యుఎస్ లో నిర్వహించాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఈ టూర్ లో చరణ్ తో పాటు చిరంజీవి మరియు అతని కుటుంబ సభ్యులు కూడా యుఎస్ వెళ్లనున్నారు. ఇదే విషయం చరణ్ ని అడిగితే అదే ప్లాన్ లో ఉన్నాం కానీ విసా ఖరారు కాలేదు. వీసా పనులు పూర్తయితే ఈ సినిమాని అనుకున్నట్లుగానే యుఎస్ లో ప్రమోషన్స్ చేస్తాము.

కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఎంతో అద్భుతమైన దృశ్య కావ్యంలా తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, జయసుధ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version