థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసిన రామ్ చరణ్

Ram-charan1
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా థాయ్ ల్యాండ్ లో జరుగుతోంది. కామెడీ టచ్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్స్ తీయడంలో స్పెషలిస్ట్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ థాయ్ ల్యాండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై వచ్చే క్లైమాక్స్ ఎపిసోడ్ తో పాటు ప్రధాన నటీనటులపై వచ్చే ముఖ్య సన్నివేశాలను షూట్ చేసారు. నేటితో ఈ షెడ్యూల్ ముగిసింది. ఈ రోజు రాత్రికల్లా ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ చేరుకోనుంది. ఈ షెడ్యూల్ తో 50-60% షూటింగ్ పూర్తయ్యింది.

ఒకటి రెండు రోజుల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ – శ్రీను వైట్ల టీం మళ్ళీ తిరిగి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించనున్నారు. 10 రోజుల పాటు హైదరాబాద్ లో జరగనున్న ఈ షెడ్యూల్ తర్వాత మరో మేజర్ షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం బ్యాంకాక్ వెళ్లనున్నారు. రామ్ చరణ్ అభిమానులకు ముందు చెప్పిన తేదీకే రిలీజ్ చెయ్యాలని ఈ సినిమాని శరవేగంగా ఫినిష్ చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 15న రిలీజ్ చెయ్యాలనుకుంటున్న ఈ సినిమాకి డివివి దానయ్య నిర్మాత. రామ్ చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఫైటర్, బ్రూస్ లీ అనే టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు.

Exit mobile version