చథా పచ్చ : ఒక్క వారంలోనే థియేటర్ల నుంచి ఓటీటీలోకి..!

chetha pacha 2

మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేస్తోంది. అద్వైత్ నాయర్ దర్శకత్వంలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చథా పచ్చ’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి హిట్ అనిపించుకున్న ఈ చిత్రం, ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, హిందీ, కన్నడ మరియు తమిళ భాషల్లో కూడా ఒకేసారి అందుబాటులోకి రానుంది. WWE తరహా రెజ్లింగ్ క్లబ్‌ను స్థాపించే ముగ్గురు సోదరుల కథతో సాగే ఈ యాక్షన్ కామెడీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో స్పెషల్ క్యామియో రోల్ చేయడం గమనార్హం.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా తెలుగు వెర్షన్ నిన్ననే (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద దీనికి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. థియేటర్లోకి వచ్చిన వారం కూడా గడవకముందే ఇది డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి వచ్చేస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Exit mobile version