శ్రీదేవి మరణ వార్తను మర్చిపోక ముందే మరొక ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఘా (55) కన్నుమూశారు. బుదవారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారు. ‘హదర్, రాయీస్, మొహంజోదారో, కాబిల్’ వంటి పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆయన మోడలింగ్, టెలివిజన్ రంగాల్లో కూడ తనదైన ముద్ర వేశారు.
ఇకపోతే ఈ నటుడు తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిం రెండు సూపర్ హిట్ సినిమాలు ‘ఛత్రపతి, యమదొంగ’, బాలక్రిష్ణ హిట్ సినిమా ‘లెజెండ్’లోను ప్రతినాయకుడి పాత్రల్ని పోషించి మెప్పించారు. ఈయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
