‘పురుష:’ నుంచి ‘చాటు చాటు’ లిరికల్ సాంగ్ విడుదల

Purusha Telugu Movie

పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ‘చాటు చాటు‘ అనే లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. సికింద్రాబాద్‌లోని కస్తూర్బా ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల సమక్షంలో ఈ పాటను లాంచ్ చేశారు.

శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ అందమైన మెలోడీకి అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆలపించారు. సహజమైన లొకేషన్స్, ఆకట్టుకునే ట్యూన్‌తో ఈ పాట తక్కువ సమయంలోనే శ్రోతలను విశేషంగా అలరిస్తూ వైరల్ అవుతోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పిస్తున్నారు.

ఈ చిత్రంలో హాసిని సుధీర్, రాయంచ కొక్కురి, విశిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, సప్తగిరి తదితరులు హాస్యం పండించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం తెలిపింది.

Exit mobile version