ఆడియో రిలీజ్ తో ‘చీకటి రాజ్యం’ ప్రమోషన్స్ షురూ

cheekati-rajyam
ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి ట్రై చేసే సౌత్ ఇండియన్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్. అన్ని డిపార్ట్ మెంట్స్ లోనూ మంచి పట్టు ఉన్న కమల్ చాలా సినిమాలకు కథ – కథనాలను కూడా అందించాడు. అలా కమల్ హాసన్ కథ – కథనం అందించి, తన అసిస్టెంట్ రాజేష్.ఎమ్. సెల్వని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘చీకటి రాజ్యం’. తమిళంలో ‘తూంగావనం’ అనే పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దమవుతోంది. దీంతో ఈ చిత్ర టీం భారీ ప్రమోషన్స్ కి సిద్దమవుతోంది.

ఈ సినిమాలో ఒకే ఒక్క పాట ఉంది, ఆ పాటని ఓ ప్రత్యేక కార్యక్రమం చేసి రేపు(నవంబర్ 3న) రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ చిత్ర టీం పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ వెర్షన్ నవంబర్ 10న రిలీజ్ కానుంటే, తెలుగులో నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ మూవీ ‘స్లీప్ లెస్ నైట్’ సినిమాకి స్పూర్తిగా వస్తున్న ఈ సినిమా కూడా హాలీవుడ్ స్టైల్ లోనే ఉంటుందట. ఈ సినిమా రన్ టైం కేవలం 127నిమిషాలతో సూపర్ ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో ఒక రెస్టారెంట్‌లోని కిచెన్‌లో త్రిష, కమల్‌ల మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. ఇక ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version