చి ల సౌ’ వెనక్కి వెళ్ళిపోయింది !

chi4

యువ హీరో సుశాంత్, రుహాని శర్మ జంటగా హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘చి ల సౌ’. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఈనెల 27 న విడుదలకావాల్సి ఉండగా అదే రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ తో పాటు సుమంత్ అశ్విన్ , మెగా డాటర్ నిహారిక నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ చిత్రం కూడా విడుదలవుతుండడం తో ఆగష్టు 3న ప్రేక్షకులముందుకు రానుంది ఈచిత్రం.

ఇక ఆ రోజున ఇటీవల ట్రై లర్ తో అంచనాలను పెంచేసిన అడివి శేష్ నటించిన ‘గూఢచారి’ చిత్రం కూడా విడుదల కానుంది. మరి బాక్సాఫిస్ వద్ద ఈరెండు చిత్రాల్లో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

Exit mobile version