బొమ్మరిల్లు హీరో సిద్దార్ధ్ నటించిన తాజా తమిళ సినిమా ‘జిగర్తాండ’. గత శుక్రవారం ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేశారు. రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన 25వ సినిమా ‘విఐపి’ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పంపిణిదారులు, ధియేటర్ ఓనర్లు ‘విఐపి’ సినిమాను తొలగించి ‘జిగర్తాండ’ విడుదల చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. మరో ఆప్షన్ లేక నిర్మాత విడుదల వాయిదా వేశారు. దీనిపై సిద్దు సీరియస్ అయ్యారు కూడా.
‘జిగర్తాండ’ విడుదల వ్యవహారంలో తమిళ పరిశ్రమ ప్రముఖులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తనకు సహకరించిన హీరో శరత్ కుమార్, నడిగర్ సంఘంలకు థాంక్స్ చెప్పారు సిద్దు.
తెలుగులో ఈ సినిమా ‘చిక్కడు దొరకడు’గా అనువాదం చేస్తున్నారు. ‘పిజ్జా’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. గ్యాంగ్ స్టార్ మ్యూజికల్ లవ్ స్టొరీగా ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో ఎప్పుడు విడుదల చేస్తారో..?
