
విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ కొడుకుగా అందరినీ నవ్వించిన బుడతడు గుర్తున్నాడా.. ఆ బుడతడి పేరే నాగ్ అన్వేష్. ఇప్పుడు నాగ్ అన్వేష్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా ‘వినవయ్యా రామయ్యా’. గతంలో ‘సింధూర పువ్వు’ సినిమా అందించిన కృష్ణారెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ఈయన తనయుడే నాగ్ అన్వేష్ కావడం విశేషం. నాగ్ అన్వేష్ సరసన ‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ పెద్ద కుమార్తెగా కనిపించిన కృతిక జయకుమార్ హీరోయిన్ గా కనిపించనుంది.
ఇటీవలే మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొని చివరి దశకు చేరుకుంది. సమ్మర్లోనే రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుండడంతో ఈ హిత్ర టీం ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ టీజర్ లో నాగ్ అన్వేష్ లుక్, నాగ్ అన్వేష్ – కృతి జయకుమార్ ల కాంబినేషన్ కూడా బాగుందని అంటున్నారు. ఫస్ట్ టీజర్ తోనే నాగ్ అన్వేష్ అందరినీ మెప్పించాడు. అనూప్ అందిన సాంగ్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. జి రామ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, నరేష్, రామరాజు, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి