‘పెద్ది’ సెట్స్‌లో బాస్.. శిష్యుడు చేసిన విధ్వంసానికి సుకుమార్ ఫుల్ హ్యాపీ..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ పెద్ది పెహల్వాన్ పాత్రతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా విధ్వంసం సృష్టిస్తుండటంతో అభిమానులు ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా చూస్తున్నారు.

కాగా, ఈ చిత్ర సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ఇటీవల సందడి చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పాత్రతో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించబోతున్నాడా అనే శాంపిల్ చూసిన మెగాస్టార్ తన సంతోషం వ్యక్తం చేశారు. అటు సుకుమార్ కూడా తన శిష్యుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న ఈ చిత్రంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు.

ఇలా ఒకేసారి టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ పెద్ది సెట్స్‌లో కనిపించడం.. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోను బుచ్చిబాబు సానా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం మరింత ఆసక్తిగా చూస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version