మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘ది బ్రేకింగ్ న్యూస్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం లాంచ్ అయింది. మీడియా నేపథ్యంతో ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు మురళీ మోహన్, అనన్య నాగళ్ల, వాసుదేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఓపెన్ స్కై క్రియేషన్స్ బ్యానర్‌పై హనుమంత్ రెడ్డి, ఉమ గుటూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కడియాల రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “మురళీ మోహన్ గారిని ఇంత అగ్రెసివ్‌గా, ఆగ్రహభరితమైన పాత్రలో ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. అలాగే అనన్య నాగళ్ల నటనను, దర్శకుడు పవన్ కడియాల పనితీరును చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు.
శశి ప్రీతం సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సాయినాథ్ సినిమాటోగ్రాఫర్‌గా, శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మీడియా థ్రిల్లర్‌ను 2026 మే నెలలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
