మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘మెగా158’ పై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో కూడా తన చిత్రాల టైటిళ్లను, సినిమా సంగతులను సరదాగా లీక్ చేసే అలవాటున్న చిరంజీవి, తాజాగా వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమా విజయోత్సవంలో తన చిత్రం టైటిల్‌ను మరోసారి లీక్ చేశారు.
ఈ క్రేజీ మాస్ ఎంటర్టైనర్కు ‘కదిరి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ తో పాటు ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కదిరి’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, ప్రస్తుతం టైటిల్ టీజర్ కోసం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమాలో ప్రియమణి, అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
